top of page

🎬 ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో జాన్వీ కపూర్ - నయా అతిలోక సుందరి! 🌟

డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే వెల్లడించారు. ఇందులో తారక్ ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.

🔥 ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం దేవర. ఈ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. 🔥🌟 తాజాగా, జాన్వీ కపూర్ లంగా ఓణీలో పల్లెటూరి పడుచులా కనిపిస్తున్న లేటెస్ట్ స్టిల్ ను దేవర యూనిట్ సోషల్ మీడియాలో పంచుకుంది. 🌟🎭 ఈ చిత్రంలో జాన్వీ పోషిస్తున్న పాత్ర పేరు 'తంగం'. "ఇదిగో మా తంగం" అంటూ చిత్రబృందం పేర్కొంది. 🎭🎥 దేవర చిత్రం తాజాగా గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ లో జాన్వీ కపూర్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. 🎥🎵 ఎన్టీఆర్ కూడా దేవర షూటింగ్ కోసం ఇటీవల గోవా వెళ్లాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. దేవర మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. 🎵


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page