top of page
MediaFx

టాయిలెట్‌లో ఫోన్ తీసుకెళ్లడం ఎందుకు మానేయాలి! 🚫📱


మొబైల్ ఫోన్ అనేది ఈ రోజుల్లో ఒక అత్యవసర సాధనంగా మారింది. అయితే, ఫోన్ వినియోగం మంచితోపాటు.. చెడు కూడా చేస్తోంది.. పెరిగిన ఫోన్ వినియోగం వ్యసనంలా మారి పలు సమస్యలు సృష్టిస్తోంది.. వాస్తవానికి ఫోన్ వినియోగం ఎంతలా పెరిగిందంటే.. 24 గంటలపాటు.. మనకు అత్యవసర సాధనంగా మారింది.. ఈ గాడ్జెట్‌ పక్కన లేకపోతే ఉండలేని పరిస్థితి ఏర్పడింది.. బాత్రూంకు వెళ్లిన ఫోన్ పట్టుకుని వెళ్లాల్సిందే.. ఇంకా ఎంతాల అడిక్ట్ అయ్యారంటే.. టాయిలెట్ సీట్ మీద కూర్చొని ఏకాంతంగా సినిమా లేదా వీడియో చూసేంతగా బానిసగా మారారు.. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదకరం.. ఒక్కరికే.. దీని కారణంగా మీతో నివసించే వ్యక్తులు కూడా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇతరులు సరైన సమయంలో బాత్రూమ్‌కు వెళ్ళే అవకాశం ఉండదు.. ఇంకా వారికి వచ్చే జబ్బులు ఇంట్లో వారికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

అటువంటి పరిస్థితిలో మీకు ఇలాంటి అలవాటు ఉంటే.. ఇప్పుడే విడిచిపెట్టి ఇకపై పునరావృతం చేయకూడదని నిర్ణయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

టాయిలెట్‌లో ఫోన్‌ను ఉపయోగించవద్దు.. ఎందుకంటే..

డాక్టర్ మనన్ వోహ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ మనలో చాలా మంది మన ఫోన్‌లను టాయిలెట్‌కు తీసుకెళుతున్నారని రాశారు. చాలా మంది తమ ఫోన్ లేకుండా వాష్‌రూమ్‌కి వెళ్లాలని అనుకోవడం లేదన్నారు. ఇలా ఫోన్‌కి అతుక్కుపోయి స్క్రోలింగ్ చేయడం లేదా అనవసర ప్రదేశాల్లో ఎక్కువసేపు మాట్లాడటం అస్సలు మంచిది కాదు.. అంటూ సూచించారు.

టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు

మీరు మీ ఫోన్‌ను టాయిలెట్‌కి తీసుకెళ్లినప్పుడు.. ప్రతి ఫ్లష్ బ్యాక్టీరియాను గాలిలోకి పంపుతుంది.. సాల్మోనెల్లా, ఇ.కోలి వంటి జెర్మ్స్‌తో మీ ఫోన్‌ను కవర్ అవుతుంది. ఈ జెర్మ్స్ కడుపు ఇన్ఫెక్షన్లు, డయేరియా, ప్రేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, ఇంకా అంటువ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

అంతే కాదు టాయిలెట్‌లో ఫోన్‌ని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మీ పురీషనాళంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్ (హెమోరాయిడ్స్) వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే.. ఈ రోజు నుంచే మీ ఫోన్‌ని టాయిలెట్‌కి తీసుకెళ్లడం మానేయండి.


bottom of page