top of page
Suresh D

కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క..💖👫


బర్రెలక్క.. సోషల్ మీడియాలో ఈ పేరు పెద్ద సెన్సెషన్. డిగ్రీ చదివినా ఉద్యోగాలు వస్తాలేవు.. అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో నెట్టింట ఆమె షేర్ చేసిన వీడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఆమెకు యువత, స్టార్స్, ప్రముఖులు సపోర్ట్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఓట్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఎలక్షన్స్ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన బర్రెలక్క పేరు ఇప్పుడు మరోసారి నెట్టింట మారుమోగుతుంది. త్వరలోనే ఆమె  పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసింది. తన ఇన్ స్టాలో నిశ్చితార్థం వీడియో షేర్ చేసి పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సడెన్ గా పెట్టుకోవడం వల్ల అందరిని పిలవలేకపోయానని చెప్పుకొచ్చింది. దీంతో బర్రెలక్క పెళ్లి ఎప్పుడు ?.. ఆమెకు కాబోయే భర్త ఎవరు ? అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. అయితే తనకు కాబోయే భర్తను ఇన్నాళ్లు చెప్పకుండానే సైలెంట్ గా ఉండిపోయింది.కానీ ఇప్పుడు పెళ్లి తేదీతోపాటు.. కాబోయే భర్తను కూడా తన ఫాలోవర్లకు పరిచయం చేసింది. అలాగే పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్ స్టా ఐడికి ట్యాగ్ చేసింది. 💖👫


bottom of page