top of page
MediaFx

ఎనిమిది ఆస్కార్ నామినేష‌న్స్ ద‌క్కించుకున్న హాలీవుడ్ మూవీని తెలుగులో చూడొచ్చు - ఏ ఓటీటీలో అంటే?🎥🍿


హాలీవుడ్ మూవీ బార్బీ ఆస్కార్స్‌తో పాటు ప‌లు అంత‌ర్జాతీయ అవార్డుల‌ను ద‌క్కించుకొని చ‌రిత్ర‌ను సృష్టించింది. 2023లో హాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ నెల‌కొల్పింది. ఆ హాలీవుడ్ మూవీ తాజాగా తెలుగులో రిలీజైంది. తెలుగు వెర్ష‌న్ శ‌నివారం నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళం ఆడియోల‌లో ఈ ఆస్కార్ విన్నింగ్ మూవీని చూడొచ్చ‌ని జియో సినిమా ఓటీటీ ప్ర‌క‌టించింది.జియో సినిమా ప్రీమియ‌ర్ స‌బ్‌స్క్రైబ‌ర్లు మాత్ర‌మే ఈ మూవీని చూడొచ్చు. 128 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్‌తో రూపొందిన బార్బీ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 1.446 బిలియ‌న్ డాల‌ర్ల క‌లెక్ష‌న్స్‌ రాబ‌ట్టింది. బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ ప‌రంగా హాలీవుడ్ రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఇండియాలో బార్బీ మూవీకి దాదాపు 150 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. మ‌న దేశంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన హాలీవుడ్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది. 96వ ఆస్కార్ అవార్డుల్లో బార్బీ మూవీ ఎనిమిది నామినేష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. బెస్ట్ పిక్చ‌ర్‌, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు, స‌హాయ‌న‌టి, కాస్ట్యూమ్ డిజైన్‌, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లేతో పాటు మ‌రికొన్ని విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ నామినేష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. బాక్సాఫీస్ వ‌ద్ద కోట్లు కొల్ల‌గొట్టిన బార్బీ మూవీకి ఐదుకుపైగా అవార్డులు వ‌స్తాయ‌ని క్రిటిక్స్ అంచ‌నా వేశారు. కానీ బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలో మాత్ర‌మే ఆస్కార్ అవార్డును అందుకున్న‌ది.


bottom of page