top of page
Shiva YT

📊📅📢 ఎస్‌బీఐ పీవో ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల..

📍న్యూఢిల్లీ, నవంబర్‌ 23: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు సంబంధించి కంప్యూటర్‌ ఆధారిత ప్రిలిమ్స్‌ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ పరీక్ష ఫలితాలను తాజాగా ఎస్‌బీఐ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు పొందుపరిచి ఫలితాలు తెలుసుకోవచ్చు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హులు. డిసెంబర్‌ 5న మెయిన్స్‌ జరగనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 2,000 పీవో పోస్టులను భర్తీ చేయనున్నారు.

👥🌐 కాగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో భర్తీ చేయనున్న పీవో పోస్టులను ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారనే సంగతి తెలసిందే. అన్ని స్టేజులు దాటి ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ బ్రాంచుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ప్రతి నెలా రూ.41,960 జీతంగా చెల్లిస్తారు.💼📚👩‍💼

bottom of page