top of page
Shiva YT

🏦 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే వారికి గుడ్ న్యూస్..ఆ బ్యాంకుల్లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు..📈

🏦 బ్యాంకులు తన వడ్డీ రేటును సవరించాయి. యాక్సిస్ బ్యాంక్, కెనారా బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అది కూడా సీనియర్ సిటిజెన్స్ ప్రయోజనకరంగా చేశాయి.

🏦 యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ 🏦 ఆగస్టు 14 నుంచి అమలులోకి వస్తుంది. యాక్సిస్ బ్యాంక్ 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 3.5% నుంచి 8.05% ఎఫ్ డీ వడ్డీని అందిస్తోంది. సాధారణ కస్టమర్లకు, బ్యాంక్ 3.5% నుంచి 7.3% ఎఫ్ డీ వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు రూ. 2 కోట్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వర్తిస్తాయి. అలాగే 16 నెలల నుంచి 17 నెలల లోపు మెచ్యూర్ అయ్యే రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 8.05% వడ్డీని అందిస్తోంది.

🏦 కెనరా బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ 🏦 ఆగస్టు 12 నుంచి కెనరా బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 4% నుంచి 7.75% ఎఫ్ డీ వడ్డీని అందిస్తోంది. బ్యాంక్ సాధారణ పౌరులకు 4% నుండి 7.25% వడ్డీ ఉంది.

🏦 ఫెడరల్ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ 🏦 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ఫెడరల్ బ్యాంక్ 15 ఆగస్ట్ 2023 నుంచి డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్‌లకు ఎంచుకున్న కాలానికి ప్రామాణిక రేటు కంటే 77 బేసిస్ పాయింట్లు ఎక్కువగా అందిస్తోంది. 13 నెలల కాలవ్యవధికి టర్మ్ డిపాజిట్ రేటు సాధారణ వర్గానికి 7.30%, సీనియర్ సిటిజన్లకు 8.07% వడ్డీ రేటును అందిస్తోంది. మెరుగుపరచబడిన రేట్లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

🏦 సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎస్ఎఫ్బీ) ఫిక్స్ డ్ డిపాజిట్ 🏦 ఈ బ్యాంకులో కొత్త ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డ రేట్లు ఆగష్టు 7 నుంచి అమలులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల కాలవ్యవధి కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను 85 బేసిస్ పాయింట్లు (0.85%) పెంచింది. ఇప్పుడు సాధారణ ప్రజలకు 4.00% నుంచి 8.60% వడ్డీ రేటుతో 7 రోజుల నుంచి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లను అనుమతిస్తుంది. సీనియర్ సిటిజన్లకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 4.50% నుంచి 9.10% ఎఫ్ డీ వడ్డీ రేటును అందిస్తోంది.

bottom of page