top of page
MediaFx

భారత్‌ వైపు దూసుకొస్తున్న బంగ్లాదేశీయులు..


బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింసతో భారత్‌లోకి అక్రమ చొరబాట్లు పెరిగే ఛాన్స్‌ ఉంది. భారత్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లా దేశీయులను బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అడ్డుకుంటోంది. బంగ్లా-భారత్‌ సరిహద్దుల్లో రాకపోకలను ఇండియన్‌ ఆర్మీ నిలిపివేసింది. బోర్డర్‌లో ఆర్మీ యూనిట్లను భారత ప్రభుత్వం మరింత అలర్ట్‌ చేసింది. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సెలవులను రద్దు చేసింది. బోర్డర్‌కు వెళ్లాలని కమాండర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సరిహద్దుల్లో అదనపు బలగాలతో పహారా కాస్తుంది. చొరబాట్లు జరగకుండా ఉండేందుకు భద్రత కట్టుదిట్టం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి మీరంతా షేక్‌ హసీనా అవామీ లీగ్‌ పార్టీ మద్దతుదారులంటూ ఎటాక్స్‌ మొదలు పెట్టారు. మైనారిటీలపై దాడులు చెయ్యొద్దని స్టూడెంట్‌ లీడర్స్‌ విజ్ఞప్తి చేస్తున్నా హింస ఆగడం లేదు. ఢాకా, చటోగ్రామ్‌, రౌజన్‌, జషోర్‌లో హిందువులు, మైనారిటీలే టార్గెట్‌గా దాడులు కొనసాగుతున్నాయి. ఇళ్లు, ఆలయాల నుంచి హిందువులను అల్లరిమూకలు బలవంతంగా తరిమేస్తున్నారు. విగ్రహాలను ధ్వంసంచేసి 20 ఆలయాలకు మతోన్మాదులు నిప్పుపెట్టారు. కర్రలు, ఆయుధాలతో హిందువుల ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేన్నారు.

bottom of page