top of page
MediaFx

బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు యదేచ్ఛగా చొరబాట్లు..


భారత దేశం సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లపై తరచుగా ఆందోళనలు వ్యక్తం అవుతూనే ఉన్నయి. మనదేశంలో అడ్డదారుల్లో అక్రమంగా అడుగు పెట్టి.. ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు అని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే కట్టుదిట్టమైన భద్రతాదళాలు దాటుకుని ఎలా మనదేశంలోకి అడుగు పెడుతున్నారు అని ఆలోచిస్తుంటే.. అందుకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో మళ్ళీ చక్కర్లు కొడుతోంది. భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చులో తెలియజేస్తున్న బంగ్లాదేశ్ యూట్యూబర్ కి సంబంధించిన పాత వీడియో మళ్ళీ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో భద్రతా ఆందోళనలను ట్రిగ్గర్ చేస్తుంది. ఇటీవల ‘DH ట్రావెలింగ్ ఇన్ఫో’ అనే బంగ్లాదేశ్ యూట్యూబర్ కి చెందిన ఓల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో, యూట్యూబర్ భారతదేశంలోకి అక్రమంగా ఎలా ప్రవేశించవచ్చో వివరంగా వివరిస్తున్నాడు. ఇంకా ఈ వీడియోలో భారత దేశంలోకి ప్రవేశించడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్, వీసా,యు పాస్‌పోర్ట్ అవసరం లేదని ఆ వ్యక్తి నిర్మొహమాటంగా వెల్లడించాడు. అంతేకాకుండా యూట్యూబర్ భారతదేశంలోకి అడుగు పెట్టే రహదారిని కూడా ప్రదర్శిస్తున్నాడు. ఈ మార్గంలో వెళ్లే వ్యక్తులు కొన్ని పర్యవసానాలను ఎదుర్కొంటారని తెలిపాడు. అంటే BSF అధికారుల దెబ్బను రుచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంకా వీడియోలో భారతదేశంలో BSF శిబిరాన్ని ప్రదర్శించాడు. భారతదేశంలోకి ప్రవేశించగల కొన్ని సొరంగాలను బహిర్గతం చేశాడు. వీడియోను ముగిస్తూ ఇలా అక్రమంగా భారత దేశంలోకి ప్రవేశించి బంగ్లాదేశ్ ప్రతిష్టను నాశనం చేయవద్దని.. అక్రమంగా ఎవరైనా ఇతర దేశంలోకి ప్రవేశించడం సరికాదని ఆ యుట్యుబర్ ప్రకటించాడు.




bottom of page