top of page
MediaFx

అరటితొక్కల గొప్పదనం తెలిస్తే పొరబాటున కూడా పారెయ్యరు..!


చాలామంది అరటి పండులో మాత్రమే పోషకాలు ఉంటాయి అనుకుంటారు. అరటిపండు తిని అరటి తొక్కలను బయట పారేస్తూ ఉంటారు. అయితే అరటి తొక్కలో కూడా పోషకాలు ఉంటాయి. అరటి తొక్కలకు ఉన్న గొప్పతనం తెలిస్తే పొరపాటున కూడా అరటి తొక్కలను పారెయ్యరు. అసలు అరటి తొక్కలో ఉండే పోషకాలు ఏమిటి? ఈ తొక్కతో కలిగే ప్రయోజనాలు ఏమిటి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 

అరటిపండు లోనే కాదు అరటి తొక్క లోను మన చర్మానికి, మన శరీరానికి, మన జుట్టుకు బోలెడు మేలు చేసే పోషకాలు ఉన్నాయి. అరటి తొక్కలో కెరోటినాయిడ్లు , పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం నుంచి టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో కీలక భూమిక పోషిస్తాయి. అరటిపండు తొక్కలో పొటాషియం మాంగనీస్ మెగ్నీషియం ఉంటాయి . అరటిపండు తొక్కతో పళ్లు రుద్దుకుంటే పళ్ళ మీద ఉండే పసుపు మరకలు పోతాయి. పళ్ళు ప్రకాశవంతంగా తెల్లగా మారుతాయి. అరటిపండ్ల తొక్కలో మన చర్మానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అరటిపండు తొక్కతో ముఖంపై మసాజ్ చేసినట్లయితే, ముఖం నిగారింపు ఉన్న సొంతం చేసుకుంటుంది. కళ్ళ కింద వాపు, నల్లటి మచ్చలు, వృద్ధాప్య సంకేతాలు ఇటువంటి వాటిని అరటిపండు తొక్క ఈజీగా పోగొడుతుంది.

 అరటిపండు తొక్కలో ఉండే హిస్టమిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, లెక్టిన్, జింక్ మొటిమలు, చర్మం దురద నుంచి కాపాడుతాయి. అరటి తొక్కలు చర్మం డ్రై కాకుండా తేమగా ఉండేలా చేస్తాయి. అరటి తొక్కలను తేనే నిమ్మరసంలో మిక్స్ చేసి, అప్లై చేసుకుని పదినిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం నిగారింపు ను సొంతం చేసుకుంటుంది. అరటి తొక్కలను జుట్టుకు రుద్దుకుంటే జుట్టుకు కావలసిన పోషకాలు అందుతాయి. ఇవి మాత్రమే కాదు అరటి పండు తో పాటు తొక్కలను కూడా తింటే డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులతో పోరాడే శక్తి మనకు లభిస్తుంది. అరటిపండు తొక్కలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల, అరటిపండు తొక్కలు తింటే మలబద్ధకం సమస్యలను ఇది తొలగిస్తుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, కంటి ఆరోగ్యం మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను బలంగా ఉంచడానికి, ఇలా ఒకటేమిటి అనేక విధాలుగా అరటి తొక్కలు ఉపయోగపడతాయి. 


bottom of page