నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైకి గంభీరంగా కనిపించినా ఆయన చాలా సున్నితత్వం 😊. పసిపిల్లాడి మనసు కలిగిన బాలయ్య తనకు ఎవరైనా నచ్చితే అంతే.. వారి కోసం ఏమైనా చేస్తారు.
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైకి గంభీరంగా కనిపించినా ఆయన చాలా సున్నితత్వం 😊. పసిపిల్లాడి మనసు కలిగిన బాలయ్య తనకు ఎవరైనా నచ్చితే అంతే.. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇటీవల విమానంలో పరిచయమైన ఓ వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారాయన 🎈.ఒక లేడీ అభిమాని పుట్టిన రోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు 🥳. కేక్ కటింగ్ చేయించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు 🎂🎉. అమెరికాలో జరుగుతున్న తానా సంబరాల్లో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి 📸🎥. తానా సభల కోసం ప్రస్తుతం అమెరికాలోని ఫిలడెల్పియాలోనే ఉంటున్నారు బాలయ్య. ఆయన సతీమణి వసుంధరతో పాటు తానా మహాసభల్లో పాల్గొన్నారాయన 🤵👰. ఈ సందర్భంగా తెలుగు వారి రాజసం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు బాలయ్య. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. తన పుట్టిన రోజు అని చెప్పగానే.. వెంటనే ఆమెతో కేక్ కటింగ్ చేయించాడు 🍰🎉.