top of page

బాలకృష్ణ అనిల్ రావిపూడి మూవీలో ఆ స్టార్..

గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది.


వీరసింహరెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కాజల్ అగర్వాల్, శ్రీలీల నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది.అయితే నిజానికి ఈ సినిమాలోని ఆ పాత్రలో తారకరత్న నటించాల్సి ఉంది. కానీ ఆయన అకాల మరణంతో ఈ పాత్రలో ఇప్పుడు అర్జున్ కపూర్ నటిస్తుంచనున్నారట. పక్కా తెలంగాణ నేపథ్యంలో రాబోతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలయ్య చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అలాగే ఈ మూవీలో బాలయ్య కాళీమాత భక్తుడిగా కనిపించనున్నారు. అంతేకాకుండా.. ఈసినిమాలో కాళీమాత దేవాలయంలో వచ్చే ఓ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుదని.. శ్రీలీల, బాలయ్య, కాజల్ మధ్యలో వచ్చి సీన్స్ ఆకట్టుకుంటాయని అంటున్నారు.


Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page