top of page

ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి బాలయ్య ‘భగవంత్‌ కేసరి’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? 🎬

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భగవంత్ కేసరి డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

నవంబర్‌ 23 లేదా నవంబర్‌ 25 నుంచి బాలయ్య సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే శుక్రవారం (నవంబర్‌ 24) నుంచే భగవంత్‌ కేసరిని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. భగవంత్‌ కేసరి సినిమాలో దంచవే మేనత్త కూతురా బిట్‌ సాంగ్‌ కూడా ఉంది. థియేటర్లలో దీనిని ప్రదర్శించలేదు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో మాత్రం ఆ సాంగ్‌ ఉండనుంది. దీనితో పాటు సెన్సార్ బోర్డ్ కట్ చేసిన కొన్ని డైలాగులును, సన్నివేశాలను కూడా ఇందులో చూపిస్తారని సమాచారం. భగవంత్‌ కేసరి సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ స్టైలిష్‌ విలన్‌గా నటించాడు. అలాగే శరత్‌ కుమార్‌, రవి శంకర్‌, రఘుబాబు, శుభలేఖ సుధాకర్‌, జాన్‌ విజయ్‌, రాహుల్‌ రవి తదితరులు కీలక పాత్రల ఓనటించారు. షైన్‌ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఎస్‌. థమన్‌ స్వరాలు అందించారు. 🍿🎭


Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page