top of page
Shiva YT

📰💰🔼 బ్యాడ్ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం,

🔼 బులియన్ మార్కెట్‌లో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. తాజాగా పసిడి, వెండి ధరలు పెరిగాయి.

దేశీయంగా శుక్రవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,450 ఉంటే.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.60,490 లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారం ధర రూ.330 మేర పెరిగింది. ఇదిలాఉంటే.. కిలో వెండి ధర రూ.1000 మేర పెరిగి రూ.78,400 లుగా ఉంది.

🔼 దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

🔼 దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600, 24 క్యారెట్ల పసిడి ధర 60,440 లుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.55,450, 24 క్యారెట్ల ధర రూ.60,490, చెన్నైలో 22 క్యారెట్లు రూ.55,800, 24 క్యారెట్లు రూ.60,870, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.55,450, 24 క్యారెట్లు రూ.రూ.60,490గా ఉంది.

🔼 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,450 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,490 లుగా కొనసాగుతోంది. 💫🏙️💸

bottom of page