top of page
MediaFx

అభిమానులకు బ్యాడ్ న్యూస్.. షాకింగ్ నిర్ణయం తీసుకోనున్న దీపికా..!


దీపికకు అంతర్జాతీయ వెబ్ సిరీస్  ‘ది వైట్ లోటస్’ మూడవ సీజన్‌లో నటించే ఆఫర్ వచ్చింది. అయితే ఆమె గర్భవతి అయినందున అందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్ మొదలయ్యే సరికి దీపికా డెలివరీ కూడా అయిపోతుంది. అయినా కూడా ఆమె నో చెప్పిందట.  పుట్టే బిడ్డకోసం దీపికా ఈ సిరీస్‌ను తిరస్కరించినట్లు సమాచారం. అలాగే దీపికా కొత్త ప్రాజెక్ట్ ఏదీ సైన్ చేయడం లేదని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. దీపిక ఎవరి సహాయం లేకుండా శిశువును చూసుకోవాలని కోరుకుంటుంది. అంటే దీపికా ఇతర సెలబ్రిటీలలా పాపను చూసుకోవడానికి నానీలను పెట్టుకోదట. అంతే కాదు తల్లి అయిన తర్వాత దీపిక తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి తమ బిడ్డను పూర్తిగా తామే చూసుకోవాలనుకుంటుందట. బిడ్డ పుట్టిన తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి బిడ్డతో ఎక్కువ సమయం సంతోషంగా గడపాలని అనుకుంటుందట దీపికా. అంటే ఇప్పట్లో దీపికా సినిమాలు ఉండకపోవొచ్చు .. ఇది నిజంగా అభిమానులకు బ్యాడ్ న్యూసే అని చెప్పాలి.

దీపికకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇది ఆమె మొదటి మాతృత్వం. దాంతో దీపిక బేబీపై ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. తొలిసారి మాతృత్వాన్ని ఆస్వాదించాలని ఆరాటపడుతోంది. దీపికా పదుకొణె తన గర్భాన్ని మార్చి నెలలో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేకమైన పోస్ట్‌ను పంచుకుంటూ, ఇద్దరూ తమ అభిమానులతో ఆనందాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, దీపిక చాలా చోట్ల తన బేబీ బంప్‌తో కనిపించింది. ఓ పాత ఇంటర్వ్యూలో దీపికా తల్లి కావాలనే కోరికను వ్యక్తం చేసింది. ‘నేను ముగ్గురు పిల్లలకు తల్లిని కావాలనుకుంటున్నాను’ అని చెప్పింది. అంతే కాదు దీపికాతో పెళ్లి తర్వాత ఓ కూతురికి తండ్రి కావాలనే కోరికను రణ్‌వీర్ బయటపెట్టాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.



bottom of page