ఈ క్రమంలోనే ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని.. రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమ్మా అని రాసి ఉన్న లాకెట్ ఫోటోస్ షేర్ చేసింది.
ఈ ముద్దగుమ్మకు అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి. దీంతో చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అటు సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా సైలెంట్. ఈ క్రమంలోనే ఇటీవల తాను తల్లిని కాబోతున్నానంటూ పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది. తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని.. రెండు వారాల కిందట చిన్నారి డ్రెస్సును, తన మెడలో మమ్మా అని రాసి ఉన్న లాకెట్ ఫోటోస్ షేర్ చేసింది.అయితే పెళ్లి కాకుండానే తల్లి కావడమేంటనీ ? నెటిజన్స్ సందేహం వ్యక్తం చేయగా.. సినిమా ప్రమోషన్స్ కోసం కొత్త ట్రెండ్ అన్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తొలిసారి బేబీ బంప్ తో ఉన్న వీడియోను తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుండగా.. పెళ్లెప్పుడు అయ్యిందంటూ కామెంట్స్ చేస్తు్న్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ఇలియానా గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో డేటింగ్ చేసింది. చాలా కాలం ప్రేమలో ఉన్న వీరు 2019లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాలపై వీరిద్దరు ఇప్పటివరకు స్పందించలేదు.