🚁 వైసీపీ కూడా చంద్రబాబు అరెస్ట్‌ను తేలిగ్గా ఏం తీసుకోవడం లేదు. అరెస్ట్ అయిన క్షణం నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటోందని ఆ పార్టీలోని కొందరు నేతలు చెబుతున్న మాట.
ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు, పొలిటికల్ కన్సల్టెంట్లు, పార్టీ నేతలు ఇచ్చే ఇన్‌పుట్స్‌తో వ్యూహాలు రచిస్తోందట పార్టీ అధినాయకత్వం. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో గమనించి.. దానికి అనుగుణంగా ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే, సెక్షన్ 30, 144 సెక్షన్లతో టీడీపీ ముఖ్య నాయకులను ఎక్కడికీ కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇది టీడీపీ క్యాడర్‌పై నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్.. సానుభూతిగా మారనంత వరకు ఆయన జైల్లోనే ఉంటేనే బెటర్ వైసీపీ ఆకాంక్షిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే టీడీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే నాయకత్వం ఉండదు కాబట్టి ఎన్నికల నాటికి పార్టీ మరింత బలహీనపడుతుందన్నది వైసీపీ భావిస్తోంది. ఏదేమైనా చంద్రబాబు బయటకు వస్తే తప్ప టీడీపీ ఇన్ని సవాళ్లను ఫేస్ చేయడం కష్టం అనేది క్లియర్‌కట్‌గా కనిపిస్తోంది. 🕵️♂️🔒👁️🗨️