top of page
MediaFx

బాహుబలి రైటర్‌ అయితే నాకేంటి..? కథ చెప్పాలా..?


పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన లైగర్‌ చిత్రం డిజాస్టర్‌ అయిన తరువాత ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ (Vijayendra Prasad) పూరికి ఫోన్‌ చేసి.. మీలాంటి దర్శకుడికి అపజయం రాకూడదు. నాకు చాలా బాధగా వుంది. మీ తదుపరి చిత్రం కథ నాకు చెప్పండి.. ఏమైనా నా వంతు సలహాలు వుండే ఇస్తాను’ అని చెప్పాడట. అయితే లైగర్‌ తరువాత పూరి జగన్నాథ్‌ రామ్‌తో డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పూరి జగన్నాథ్‌ ఈ విషయం గురించి చెప్పాడు.

అయితే డబుల్‌ ఇస్మార్ట్‌ కథ మాత్రం ఆయన రచయిత విజయేంద్రప్రసాద్‌కు చెప్పలేదు. ఇక్కడే పూరి మనస్సు అంగీకరించలేదు. తన మనస్తత్వానికి విరుద్దంగా ఆయన ఆ పని చేయలేదు. అయితే ఇడియట్‌, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు తీసిన పూరి ఇంకొకరి కథ చెప్పి కరెక్షన్స్‌ తీసుకునే అవసరం వుందా? అని ఆలోచిస్తే లేదనే చెప్పాలి.. ఎందుకంటే మరో బ్లాక్‌బస్టర్స్‌ వస్తే ఈక్వేషన్స్‌ అన్ని మారిపోతాయి.. ఈ విషయంలో పూరి డిసిషన్‌ కరెక్టేనని అంటున్నారు ఆయన సన్నిహితులు.


bottom of page