top of page
MediaFx

ఓటీటీలోకి బాహుబలి సరికొత్త కథ..కట్టప్పే విలన్..🗡️


బాహుబలి మూవీ ద్వారా రాజమౌళి పరిచయం చేసిన రాజ్యం మాహిష్మతి. ఇప్పుడీ కల్పిత సామ్రాజ్యం మరో శతృవుతో పోరాడబోతోంది. ఆ శత్రువు పేరు రక్తదేవ్. అతని సైన్యానికి అధిపతి కట్టప్ప. తమకు శిక్షణ ఇచ్చిన వ్యక్తిపైనే మన సైన్యం ఎలా గెలుస్తుందంటూ నేరుగా బాహుబలి, భల్లాలదేవే రంగంలోకి దిగుతారు. ఈ సరికొత్త కథతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రూపొందించిన ఓ యానిమేషన్ సిరీస్ రాబోతోంది.

ఈ యాక్షన్ సిరీస్ హాట్‌స్టార్ లో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆ బాహుబలికి రాజమౌళి దర్శకుడిగా పని చేయగా.. ఈ బాహుబలికి అతడు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. జీవన్ జే కాంగ్, నవీన్ జాన్ డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ ట్రైలర్ ను తాజాగా హాట్‌స్టార్ రిలీజ్ చేసింది. ఇందులో అమరేంద్ర బాహుబలిని భల్లాలదేవుడు వెన్నుపోటు పొడవడానికి ముందు కొత్త శత్రువుతో మాహిష్మతి చేసిన పోరాటాన్ని చూపించారు.

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే టైటిల్ తో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తన జీవితం మొత్తం మాహిష్మతికే అంకితమిచ్చిన కట్టప్పే ఈ సరికొత్త కథలో అదే మాహిష్మతిపై పోరాటం చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. బాహుబలి ప్రపంచాన్ని యానిమేషన్ లో చూడాలనుకునే వారికి ఈ కొత్త సిరీస్ మంచి అనుభూతిగా చెప్పవచ్చు.


bottom of page