top of page
MediaFx

శ్రీరామ నవమి వేడుకలకు సిద్ధమవుతున్న అయోధ్య..

శ్రీరామ నవమి వేడుకలకు దేశంలోని ప్రముఖ ఆలయాలు, క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తామవుతున్నాయి. శ్రీరాముడి కళ్యాణ ఏర్పాటకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామనవమికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అయోధ్యకు రాములోరి భక్తులు అప్పుడే తరలివస్తున్నారు.

అయితే జనవరిలో బాల రాముడి ప్రతిష్టాపన కార్యక్రమం కంటే పెద్దగా జరుగబోతుండటంతో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అయితే సూర్య కిరణాలు నవమి రోజున బాల రాముడి నుదుటిపై పడుతాయి. ఈ అపూర్వ ఘట్టం శ్రీరామ నవమి రోజున అయోధ్యంలో కనిపించనుంది.  దీంతో భక్తులు భారీగా తరలివచ్చే అకవాశం ఉంది. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వేడుకల కోసం పోలీసు అధికారులు 24 గంటల పాటు షిఫ్టులు పనిచేయనున్నారు.

సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎస్ మిశ్రా తెలిపారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులను ఏర్పాటుచేయాలని, అన్ని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. 12 చోట్ల తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటికి అవసరమైన అన్ని మందులు, సౌకర్యాలు కల్పిస్తామమని వైద్యశాఖ అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణ, భక్తుల సౌలభ్యం కోసం అయోధ్యతో పాటు ఆలయ గర్భగుడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసే హోల్డింగ్, పార్కింగ్ ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. 24×7 తేదీల్లో ఆలయ ప్రాంగణం, మేళా ప్రాంతంలో భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. 24 గంటలూ ఆ ప్రాంతమంతా సీసీటీవీ కవరేజీ ఉంటుంది. భక్తుల కదలికలను పర్యవేక్షించడానికి, ట్రాఫిక్ నియంత్రణకు, రద్దీ అంచనాకు వీటిని ఉపయోగించాలి’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అయోధ్య అంతటా 24 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశామని, అంబేడ్కర్ నగర్, సుల్తాన్పూర్, బారాబంకీ జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలను పర్యవేక్షిస్తామని తెలిపారు.

bottom of page