top of page
Suresh D

హనుమాన్ సినిమా చూస్తూ విచిత్రంగా ప్రవర్తించిన మహిళ..🎥🎞️

తాజాగా ఓ మహిళ హనుమాన్ సినిమా చూస్తూ విచిత్రంగా ప్రవర్తించింది. ఉన్నట్టుండి సీట్ లో నుంచి లేచి అరవడం మొదలు పెట్టింది. ఆమె అలా చేయడంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు.

సంక్రాంతికి ఈసారి బరిలో దిగిన సినిమాలు అన్ని సైలెంట్ అయిపోయాయి కానీ హనుమాన్ సినిమా మాత్రం ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమా ఇప్పటికే 250కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. ఇతిహాసాల నేపథ్యంలో సూపర్ హీరో కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది. జనవరి 12న విడుదలైన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తుంది. 

ఓ సామాన్యుడికి స్పెషల్ పవర్స్ వచ్చి సూపర్ హీరోలా ఎలా మారాడు. ఆ పవర్స్ తో జనాలను ఎలా కాపాడాడు అన్నది ఈ సినిమాలో చూపించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా చివరిలో హనుమంతుడు రావడం సినిమాకే హైలైట్ అని చెప్పాలి. చివరి నలభై నిముషాలు ప్రేక్షకులను సీట్స్ అంచున కూర్చునేలా చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ మహిళ హనుమాన్ సినిమా చూస్తూ విచిత్రంగా ప్రవర్తించింది. ఉన్నట్టుండి సీట్ లో నుంచి లేచి అరవడం మొదలు పెట్టింది. ఆమె అలా చేయడంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. అయితే కొంతమంది ఆమెకు ఫైట్స్ వచ్చిందని అంటున్నారు. మరికొంతమంది సినిమా చూస్తూ ఉద్వేగానికి గురైందని అంటుంటే మరికొంతమంది పూనకం వచ్చిందని అంటున్నారు. సరిగా సినిమా క్లైమాక్స్ సమయానికి ఆమె అలా అరవడం, చిత్రంగా ప్రవర్తించడంతో అలజడి రేగింది. ఈ సంఘటన ఉప్పల్ లో జరిగింది.🎥🎞️


bottom of page