top of page

రెంట్ లేకుండా ప్రముఖ ఓటీటీలో అవతార్ 2 స్ట్రీమింగ్ .. ఎప్పటి నుంచి అంటే..

Avatar 2 OTT Release దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే ప్రేక్షకులకు చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'‌కు సీక్వెల్​గా వచ్చింది ఈ 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్' (Avatar: The Way of Water ).​ క్రిస్మస్ సందర్భంగా 2022 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా మార్చి 28 నుంచి రెంట్ బేసెస్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా ఈ సినిమాను రెంట్ లేకుండా డైరెక్ట్ ఓటీటీలో చూసే టైమ్ వచ్చేసింది.

హాలీవుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. ఈ సినిమాను మూవీ లవర్స్ మదిలో ఎప్పటికీ చెరిగిపోలేదు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్​ వండర్​ 'అవతార్'‌కు సీక్వెల్​గా వస్తున్న మూవీ 'అవతార్​: ది వే ఆఫ్​ వాటర్' (Avatar: The Way of Water ).​ ఈ సినిమా గతేడాది 2022 డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా భారత్‌లో మంచి ఆదరణ పొందింది.

భారత దేశంలో దాదాపుగా అన్ని ప్రధాన భాషల్లో కూడా విడుదలైంది. తెలుగు వర్షన్‌కు ప్రముఖ తెలుగు యువ దర్శకుడు, నటుడు అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ రాశారు. దీంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. అవతార్ 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది..

జేమ్స్ కెమరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్ సినిమా 2009లో విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్‌గా లేటెస్ట్‌గా అవతార్ 2 వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది.“అవతార్ ది వే ఆఫ్ వాటర్” అనే పేరుతో డిసెంబర్‌లో విడుదలైన ఈ సినిమా ఇక ఓటీటీలో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అవతార్: ది వే ఆఫ్ వాటర్ Apple TV, Prime Video, VUDU, Google Play, XFINITY, AMC & Microsoft ఫ్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది పేయిడ్ మోడ్‌లో అందుబాటులో ఉండనుంది. రెంటల్ ధర: $19.9 డాలర్స్ లేక 1639 రూపాయలు ఉంది.

ఇప్పటి వరకు ఈ సినిమాను రెంట్ ప్రాతిపదికన పలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాను డిస్నీ + హాట్ స్టార్‌లో జూన్ 7న ఎలాంటి అద్దె లేకుండా ఓటీటీలో వీక్షించవచ్చు. ఈ విషయాన్ని డిస్నీ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఎన్ని భాషల్లో విడుదల చేస్తుందనే విషయాన్ని డిస్నీ హాట్ స్టార్ ప్రకటించలేదు. ఈ ప్రకటనతో ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో చూడడానికి మేము రెడీ అంటున్నారు అభిమానులు.

ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. వరల్డ్ వైడ్’గా 2 బిలియన్ డాలర్స్‌ను రాబట్టిన ఈచిత్రం.. క్లోజింగ్ కలెక్షన్స్‌ను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్‌ విషయానికి వస్తే.. నైజాంలో 31.46 కోట్లు, సీడెడ్ 7.01 కోట్లు, ఉత్తరాంధ్ర 8.13 కోట్లు, ఈస్ట్+ వెస్ట్ 3.68 కోట్లు, కృష్ణా +గుంటూరు 7.11 కోట్లు, 3.35 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 60.74 కోట్ల షేర్ వసూలు అయ్యిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా... రూ.5.25 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది.

ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్ ముగిసేసరికి రూ.60.74 కోట్ల భారీ షేర్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది. దీంతో అవతార్ 2 దాదాపుగా 55.49 కోట్ల లాభాలను అందించింది. అంతేకాదు డబ్బింగ్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాగానే ఆదరణ పొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్స్‌కు (2.174 billion ) పైగా వసూళ్లను సాధించి వావ్ అనిపించింది..

ఇక ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యింది. సినీ అభిమానులకు షాక్‌ గురిచేస్తూ రిలీజ్‌‌కు ఒక రోజు ముందే ఈ సినిమా పైరసీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైపోయింది. ఈ సినిమా ‘టెలిగ్రామ్’ (Telegram) యాప్‌లో హల్ చల్ చేస్తోంది. కొన్ని వందల కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన అవతార్2 సినిమా పైరసీ బారినపడడం ఏ మాత్రం బాగాలేదని, ఇది సరైన పద్దతి కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన అవతార్ 2, మరో రికార్డ్‌ను బ్రేక్ చేసింది. గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కేజీయఫ్ 2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 2022 ఏడాది కేజియఫ్ 2 సినిమాకు మల్టీ ప్లెక్స్‌లలో ఆల్ టైం హైయ్యెస్ట్ అడ్వాన్స్ టికెట్స్‌ బుకింగ్ అయ్యాయి. ఈ సినిమాకు 4 లక్షల 11 వేలకి పైగా టికెట్స్ భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్ అవ్వగా.. ఇక లేటెస్ట్ అవతార్ 2 దీనిని బ్రేక్ చేసేసింది. అవతార్ 2కు మన దేశంలోనే ఏకంగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో కేజీయఫ్ 2పై ఉన్న రికార్డ్‌ను అవతార్ 2 బ్రేక్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 55వేల థియేటర్స్‌లో భారీగా విడుదలైంది. అవేంజర్స్ ఎండ్ గేమ్ గత రికార్డ్‌ను బద్దలు కొడుతూ కనివిని ఎరుగని స్థాయిలో భారీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా ఎవరు ఊహించనంత నిడివి.. ఉండనుంది. ఈ సినిమా 3 గంటల 12 నిమిషాల 10 సెకన్ల నిడివితో వచ్చింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విజువల్ వండర్ అని చెప్పోచ్చు. ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌తో మరో రేంజ్‌లో ఉంది సినిమా. సినిమాలో తమ తెగని కాపాడుకునే క్రమంలో చూపించిన యుద్ధ సన్నివేశాలు వావ్ అనిపిస్తున్నాయి.

భారీ సెట్టింగులు, ఫైట్స్, యాక్షన్ ఇలా అదిరిపోయింది. మరొక్కసారి పండోరాకు తీసుకువెళ్లారు దర్శకుడు జేమ్స్ కామెరాన్. ప్రతీ సన్నివేశం అదిరిపోయింది. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, గ్రాఫిక్స్ ఇలా ఒకటి ఏమిటీ అంతా అదుర్సే..

ఇక అవతార్ 1 విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని 1994లో రాయడం మొదలు పెట్టి షూటింగ్ పూర్తయ్యేవరకు 15 యేళ్లకు పైగా సమయం పట్టింది. దాదాపు 237 మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే 3 బిలియన్ యూఎస్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసింది. అవతార్ సిరీస్ నుంచి వరుసగా సీక్వెల్స్ విడుదల కానున్నాయి. వాటి డేట్స్ కూడా కామెరూన్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక అవతార్ 3 సీక్వెల్‌ను కూడా 20 డిసెంబర్ 2024లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 2026 డిసెంబర్ 18 ‘అవతార్ 4’ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ‘అవతార్ 5’ సినిమాను 22 డిసెంబర్ 2028 న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా వరుసగా ఐదు సీక్వెల్స్‌ను ప్రకటించడమే కాదు. వాటికి సంబంధించిన రిలీజ్ డేట్స్‌ ను కూడా ప్రకటించడం విశేషం.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page