top of page
Suresh D

ట్రోలర్స్ కు ఈ విషయం అర్థం కాలేదు!.. అవంతిక

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా కనిపించిన ఈ చిన్నారి.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది.

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు అవంతిక వందనపు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో బాలనటిగా కనిపించిన ఈ చిన్నారి.. ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. అక్కడ వరుస ఆఫర్స్ అందుకుంటూ హాలీవుడ్ నటీనటులకు పోటీనిస్తుంది. చిన్న వయసులో తెలుగు సినిమాలు, కమర్షియల్ యాడ్స్ చేసి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె కొన్నాళ్లపాటు మీడియాకు దూరంగా ఉంది. ఆ తర్వాత సడెన్‏గా హాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక్షమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మీన్ గార్ల్స్.  ఇక ఇదే సినిమాలో అవంతిక చేసిన స్పెషల్ సాంగ్ హిట్ అయ్యింది. దీంతో ఆమె పేరు నెట్టింట సెన్సెషన్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా అమెరికాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో అవంతిక ఇంటర్వ్యూలపై నెట్టింట దారుణంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.అవంతిక వందనపు మాట్లాడిన తీరుపై.. ఆమె అమెరికన్ ఆక్సెంట్.. ఫేస్ ఎక్స్‏ప్రెషన్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరిగింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ట్రోల్స్ పై స్పందించింది అవంతిక.. అమెరికన్ ఆక్సెంట్ లో మాట్లాడుతుంటే చాలా మంది ట్రోల్ చేస్తున్నారు.. అలాంటి సమయంలో ఎలా ఫీలయ్యావు అని అడగ్గా.. అవంతిక మాట్లాడుతూ.. “నాకే అర్థం కావడం లేదు.. నేను అమెరికలో పుట్టిపెరిగాను.. మేము స్కూల్ కు వెళితే ఇంగ్లీష్ ఆక్సెంట్ మాట్లాడతాము. ఇంట్లో అమ్మ నాన్నతో ఇండియన్ ఇంగ్లీష్ ఆక్సెంట్ తో మాట్లాడతాము.. దీనిని కోడ్ స్విచ్చింగ్ అంటారు. కానీ ఈ విషయం చాలా మందికి అర్థం కాలేదని ఇప్పుడు తెలిసింది. అందరూ ట్రోల్స్ చేశారు..ఇలా ఎందుకు మాట్లాడుతుంది అంటున్నారు. అది నా న్యాచురల్ ఆక్సెంట్ ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవంతిక కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

bottom of page