top of page

చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా.. 134 పరుగులతో సౌతాఫ్రికా ఘన విజయం. 🏏

వరల్డ్ కప్ అంటేనే రెచ్చిపోయి ఆడే ఆస్ట్రేలియా ఈసారి తేలిపోతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

వరల్డ్ కప్ అంటేనే రెచ్చిపోయి ఆడే ఆస్ట్రేలియా ఈసారి తేలిపోతోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడించగా.. తాజాగా దక్షిణాఫ్రికా 134 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ప్రపంచకప్‌లో సఫారీలకు ఇది వరుసగా రెండో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూలను సఫారీ బౌలర్లు కంగారెత్తించారు. రబాడా మూడు వికెట్లతో చెలరేగాడు. కేశవ్ మహారాజ్, మార్కో జాన్సన్, శంసీ తలో రెండు వికెట్ల తీయడంతో 40.5 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. లబూషేన్ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు డికాక్‌కు దక్కింది.


ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అగ్రస్థానంలో ఉన్న కివీస్ రెండు, టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. టాప్-4లో ఉన్న జట్లు రెండు విజయాలు సాధించగా.. మెరుగైన రన్‌రేట్ కారణంగా సౌతాఫ్రికా టాప్ ప్లేస్‌లో ఉంది. మెగా టోర్నీలో ఒక్కొ విజయం సాధించిన ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇక తరువాతి స్థానాల్లో శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి. ఈ నాలుగు జట్లు తొలి గెలుపు కోసం చెమటడొస్తున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిసిన తరువాత టాప్-4లో ఉన్న జట్లు సెమీస్‌లో అడుగుపెడతాయి. 🏆🔥

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page