అంతులేని కథలా సాగిన టీవీ సీరియళ్లకు సైతం శుభం కార్డు పడుతోంది గానీ.. టెక్కలి థియేటర్‌లో ఆడుతున్న దువ్వాడ కుటుంబ కథా చిత్రానికి మాత్రం ఎండ్‌కార్డు పడ్డం లేదు. పూటకో మలుపు.. రోజుకో ట్విస్ట్ అన్నట్టుగా.. కథ కొనసాగుతోంది. ఎండ్ కార్డ్ పడుతుంది అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక ట్విస్ట్‌తో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వివాదంలో ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటి ట్విస్ట్ రివీల్ అయింది. ఇటీవల మాధురికి జరిగిన యాక్సిడెంట్‌ని సూసైడ్ అటెమ్డ్‌గా క్రియేట్ చేసేందుకు దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నించారని… మాధురి కోసం కట్టుకున్న భార్యపై అబద్ధాలు చెప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు దువ్వాడ వాణి. దువ్వాడ శ్రీనును ఎమ్మెల్సీ పదవి నుంచి టెర్మినేట్ చేయాలని డిమాండ్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ గొడవ జరుగుతున్న టైంలోనే మాధురికి కారు ప్రమాదం జరిగింది. అయితే ఇది ప్రమాదం కాదు.. తానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు, దానికి వాణే కారణమని మధురి చెప్పారు. అయితే, ఈ క్రమంలోనే ఓ ఆడియో సెన్సెషనల్ గా మారింది.. ఇది ప్రమాదం కాదని ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నించినట్టు చెప్పాలని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నట్టు వైరల్ ఆడియోలో ఉంది. మధురికి యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఆత్మహత్యాయత్నంగా చిత్రీకరించి తనను ఇరికించే ప్రయత్నించారని వాణి పేర్కొంటున్నారు. అయితే ఆ ఆడియోలో ఉన్నది తన వాయిస్ కాదంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. అసలు ఆ ఆడియో ఎలా వచ్చింది..? ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారో తేల్చాలంటున్నారు.
ప్రమాదాన్ని సూసైడ్ అని చెప్పించి తనపై నిందలు వేస్తున్నారని వాణి పేర్కొన్నారు. శ్రీనును MLC పదవి నుంచి టెర్మినేట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే.. వైరల్ అవుతున్న ఆడియో ఫేక్ అంటూ దువ్వాడ శ్రీను పేర్కొన్నారు. అది తన వాయిస్ కాదన్నారు. మొత్తంగా ఇది..! దువ్వాడ దుమారంలో ట్విస్టులు, మలుపులు ఆసక్తిగా మారుతున్నాయి. ఇలా ఎండ్‌కార్డు ఎప్పుడు పడుతుందో తెలియాలంటే.. వెయిట్ చేయాల్సిందే..