🌿🌬️ఉత్తర బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఈ తెల్లవారుజామున వాయుగుండం గా మారింది.
మరికొద్ది గంటల్లో మరింత బలపడి ఈ సాయంత్రానికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. వాయుగుండానికి అనుబంధంగా సముద్రమట్టానికి 9.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి గాలులో తెలుగు రాష్ట్రాలపైకి వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరకొస్తాలో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మూస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. 🍃