top of page
MediaFx

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ ఇంటిపై దాడి..


నేపథ్యం ఇదే..

1962లో గాజాకు సమీపంలో ఓ శరణార్థి శిబిరంలో ఇస్మాయిల్ జన్మించాడు. 1980 చివరలో హమాస్‌లో చేరాడు. 1990లో ఇస్మాయిల్ హనియా పేరు ప్రపంచానికి తెలిసింది. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు సన్నిహితంగా మెలిగేవాడు. రాజకీయంగా సలహాలు ఇచ్చేవారు. అలా హమాస్‌లో క్రమంగా ఎదిగారు. 2004లో ఇజ్రాయెల్ చేసిన దాడిలో అహ్మద్ యాసిన్ చనిపోయారు. తర్వాత హమాస్‌లో ఇస్మాయిల్ కీలక వ్యక్తిగా మారారు.


హమాస్ చీఫ్‌గా..

2006లో పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికయ్యారు. గాజా పట్టిని కొద్దిరోజులు పాలించారు. 2007 జూన్‌లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ అతన్ని పదవి నుంచి తొలగించారు. అప్పటి నుంచి గాజాలో యుద్ధం మొదలైంది. అబ్బాస్ ఆదేశాలను సైతం ఇస్మాయిల్ ధిక్కరించాడు. పాలస్తీనా స్టేట్ ప్రధానిగా కొనసాగాడు. 2017లో హమాస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఇస్మాయిల్‌ను అమెరికా ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఇస్మాయిల్ గాజా పట్టిని వీడి, ఖతర్‌లో ఉంటున్నారు. ఈ ఏప్రిల్ నెలలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియా కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు చనిపోయారని హమాస్ ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడిలో హనియా మృతిచెందాడు. అతని సెక్యూరిటీ గార్డ్ కూడా చనిపోయాడు.

bottom of page