top of page

🔥🚒 విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం.. 400లకు పైగా వాహనాలు దగ్ధం.. 🔥🚗💥

🌆🔥విజయవాడ నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది…🏙️🔥🚒 ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న టీవీఎస్ షో రూమ్ అగ్నికి ఆహుతైంది…📺🔥 400లకు పైగా టూ వీలర్స్ అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యాయి. 🔥🛵🔥

ఏలూరు రోడ్ లోని స్టెల్లా కాలేజ్ సమీపంలో ఉన్న షో రూమ్ లో తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. 🌇🔥 అగ్ని ప్రమాద సమయంలో దాదాపు 650 కు పైగా ఎలెక్ట్రిల్ ,పెట్రోల్ వాహనాలు షో రూమ్ లో ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. ⚡🛵 తెల్లవారు జామున భారీ ఎత్తున ఎగసి పడ్డ మంటలు గంటన్నర వ్యవధిలోనే షో రూమ్ మొత్తాన్ని పూర్తిగా దగ్ధం చేసాయి. 🕒🔥 ఈ అగ్ని ప్రమాదంలో 400 కు పైగా కొత్త వాహనాలతో పాటు కొన్ని సర్వీస్ కు వచ్చిన వాహనాలు పూర్తిగా కాళీ బూడిదయ్యాయి. 🚗🔧 ఈ అగ్నిప్రమాదంలో లోపల మనుషులు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పి భారీగా ఆస్తి నష్టం జరిగింది. 😢💔 భారీ ఎత్తున ఎగసి పడ్డ మంటలతో బిల్డింగ్ మొత్తం దగ్ధం అయింది. 🏢🔥🚒🚓 దాదాపు మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు . 🔥🚓🚒 ప్రీఫ్యాబ్రిక్‌ పద్ధతిలో నిర్మించిన షోరూమ్‌ కావడం వల్లే మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. 🏢🔥🚒 గోదాములో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయని పేర్కొన్నారు. 🏍️⚡🛢️🚗 మరోవైపు పెట్రోల్‌ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్‌ వాహనాలను కూడా పార్క్‌ చేసి ఉంచడం.. ⛽🚗🏍️ అలాగే వాటికి ఛార్జింగ్‌ పెట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 🚧🔌🔍👮 ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని.. తర్వాత అన్ని విషయలా వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 🔍👮


Kommentare


bottom of page