top of page
Shiva YT

బ్లేడుతో ప్రిన్సిపాల్ గొంతు కోసిన స్టూడెంట్..ఎక్కడో..?ఎందుకో..?తెలిస్తే షాక్ అవుతారు

స్కూల్స్‌, కాలేజీల్లో చదివే విద్యార్దులను టీచర్లు, ప్రిన్సిపాల్‌ కొట్టడం కామన్. కాని ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం( Prakasam District) జిల్లాలో ఓ స్టూడెంట్ బ్లేడుతో ప్రిన్సిపాల్‌ పీక కోశాడు. ఈఘటనలో ప్రిన్సిపల్‌ ప్రాణపాయం నుంచి బయటపడటంతో విషయం పోలీసుల వరకు వెళ్లింది. గిద్దలూరులోని సాహితీ జూనియర్ కాలేజీలో గొంట్ల గణేష్ అనే స్టూడెంట్ ఇంటర్ చదివాడు.

అదే కాలేజీలో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న కొండారెడ్డి(Konda Reddy)ని గురువారం చిన్న మసీదు సెంటర్‌లో పక్కా పథకం ప్రకారం బ్లేడుతో పీకపై దాడి చేశాడు గణేష్(Ganesh). స్టూడెంట్ చేతిలో గాయపడిన ప్రిన్సిపాల్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గతేడాది ఇంటర్ పరీక్షల సమయంలో కాపీ కొడుతంటే ప్రిన్సిపాల్ చూసి డిబార్ చేశాడనే కోపంతో ఈవిధంగా పగ తీర్చుకున్నాడు.గతంలో పాఠశాలలు, కాలేజీల్లో స్టూడెంట్స్ తప్పు చేస్తే గురువు దండించే వారు. కాని ఇప్పుడు తప్పు చేసి కూడా స్టూడెంట్సే గురువులపై దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సాహితి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్‌ కొండారెడ్డిపై గురువారం గణేష్ అనే విద్యార్ధి బ్లేడుతో దాడి చేశాడు. గాంధీ బొమ్మ చౌరస్తాలో గురువారం రాత్రి ప్రిన్సిపాల్‌పై పథకం ప్రకారం దాడి చేశాడు స్టూడెంట్ గణేష్. బ్లేడుతో గొంతు కట్ చేయబోతుండగా చేయి అడ్డం పెట్టుకోవడంతో ప్రిన్సిపాల్ కొండారెడ్డి ప్రాణాలతో బయటపడ్డాడు.

bottom of page