top of page
Shiva YT

🐟🎣 బాబోయ్‌ భయంకర చేప.. వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని షాక్‌ 🎣🐟

🌊🏖️ పశ్చిమ బెంగాల్‌లో రాంనగర్ తీర ప్రాంతంలో మత్స్యకారుని వలకు ఒక వింత చేప చిక్కింది. ఆ వింత చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.

ఈ చేపను పరిశీలించి షుగర్‌మౌత్ క్యాట్ ఫిష్ అని తెలిపారు. దీని శాస్త్రీయ నామం హైపోస్టోమస్ ప్లెకోస్టోమస్. ఇవి ఉష్ణమండలంలో మంచినీటిలె పెరిగే చేపగా అధికారులు గుర్తించారు. ఈ చేప వింతగా ఉండటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు చూసేందుకు ఎగపడ్డారు. విదేశీ జాతుల చేపలను సాధారణంగా అక్వేరియంలో అలంకరణలుగా ఉంచుతారు. ఇవి ఫాస్ట్ బ్రీడింగ్ ఫిష్. ఇవి చిన్న చేపలు, చేపల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. వీటి రెక్కలు చాలా పదునుగా ఉంటాయి. వాటితోనే ఇవి ఇతర చేపలను సులభంగా గాయపరుస్తాయి. ఆ తర్వాత అవి కుళ్లిపోయి చనిపోతాయి. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని రామనగర 1 బ్లాక్‌లోని తీర ప్రాంతంలో ఆగస్టు 7న ఈ చేప పట్టుబడింది. 🌊🏖️🎣🐟

bottom of page