top of page

త్వరలోనే మరో రెండు ఎన్నికల హామీల అమలు.. అసెంబ్లీలో గవర్నర్ ప్రకటన🌐📈

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. ముందుగా కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారన్నారు.

తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. ముందుగా కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారన్నారు. ప్రగతిభవన్‌.. ప్రజాభవన్‌గా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. అర్హులకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని చెప్పారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం అని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది. తద్వారా కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న విషయాన్ని మరోసారి సభలో ప్రస్తావించారు. ఇంటర్నెట్‌ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం అని కాంగ్రెస్ పేర్కొన్న అంశాలను శాశససభలో చదివి వినిపించారు. దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం. కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్లు పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్‌, లక్నవరంలను తీర్చిదిద్దుతామని చెప్పారు.

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటి వరకు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించినట్లు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను భారీ స్థాయిలో చేపడుతామన్నారు. మూసీ నది మరోసారి హైదరాబాద్ జీవనాడిగా మారుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (ఐఏ)కి ప్రధాన కేంద్రంగా హైదరాబాద్‌ని అభివృద్ధి చెస్తామన్నారు. 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

ఇదిలా ఉంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ఇవాళ్టి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరవుతారని తొలుత భావించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాక గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ గురువారం జరిగే గవర్నర్ ప్రసంగానికి రారని, బడ్జెట్ రోజు వస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీంతో తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారన్నది తెలియాల్సి ఉంది. దీని కోసం సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.🌐📈

bottom of page