top of page

జగన్ అసెంబ్లీకి వస్తున్నారా? అసెంబ్లీ సమావేశాలు రసవత్తరం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 21, 22 తేదీలలో రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్ తాజాగా వెలువడింది. తొలుత ఈ నెల 24 నుంచి 26 వరకూ మూడు రోజుల పాటు కొత్త శాసనసభ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో పాటు లోక్ సభ స్పీకర్ ఎన్నిక వంటివి ఉన్నాయి. పైగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ కీలకమైన పాత్ర పోషిస్తోంది. దాంతో అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యేల ప్రమాణాలు స్పీకర్ ఎన్నికతో ముగించేలా రెండు రోజుల పాటు షెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. జగన్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న సస్పెన్స్ ఒక వైపు కొనసాగుతూంటే దానిని భిన్నంగా జగన్ అసెంబ్లీకి వస్తున్నారు అని ఒక రూఢీ అయిన సమాచారం అయితే వినిపిస్తోంది. మొత్తం తనతో పాటు పది మంది ఎమ్మెల్యేలతో జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. దాంతో అసెంబ్లీ సమావేశాలు రక్తి కట్టడం ఖాయమని అంటున్నారు. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకోవడం ఒక మంచి మార్పు అని అంటున్నారు.

 నిన్నటి దాకా ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో ఈ రోజు సాధారణ సభ్యుడిగా ఆయన అడుగు పెట్టరు అని అనుకున్నా స్పీకర్ నిర్ణయం మీదనే అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ఏమి చేసినా ఓకే అన్నట్లుగానే వైసీపీ ప్రిపేర్ అవుతోంది. తాము ఎక్కడ ఉన్నా ప్రజా సమస్యలను ప్రస్తావించాలని భావిస్తోంది. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు కేవలం సభ్యుల ప్రమాణాలు స్పీకర్ ఎన్నికల వరకే కాబట్టి చర్చలు ఏమీ ఉండవు. ఇక జగన్ అసెంబ్లీ సమావేశాల కోసమే తన పులివెందుల పర్యటనను వాయిదా వేసుకున్నారు అని అంటున్నారు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ఉంటాయని భావించి ఆయన మూడు రోజుల పాటు సొంత నియోజకవర్గం టూర్ పెట్టుకున్నారు. అయితే ఇపుడు దానిని ఆయన రద్దు చేసుకోవడంతో జగన్ అసెంబ్లీకి హాజరవుతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు చూస్తే స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుని ఎన్నుకుంటారు అని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తం మీద అధికార పాత్రలో సీఎం గా చంద్రబాబు డిప్యూటీ సీఎం గా పవన్ ఇటు విపక్ష నేతగా జగన్ ఈసారి అసెంబ్లీలో కనిపించనున్నారు అని అంటున్నారు. 

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page