top of page

📰 బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై హత్యాయత్నం..😱

🗓️ మెదక్‌, అక్టోబర్ 30: బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. 💔 ఎన్నికల ప్రచారంలో దుండగుడు కత్తితో దాడి చేశాడు. 🗳️

ప్రభాకర్‌రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. 🏥 దాడి చేసిన వ్యక్తిని బీఆర్‌ఎస్ కార్యకర్తలు చితక్కొట్టారు. 🦺 దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 🏞️ దుబ్బాక నుంచి పోటీ చేస్తున్నారు కొత్త ప్రభాకర్‌రెడ్డి. 🚗

👥 ప్రస్తుతం ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. 🏛️ ఇందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ప్రచారం చేస్తున్నారు. 🗣️ పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడంతో ఆయన కారు నుంచి కిందికి దిగిన తర్వాత కత్తితో దాడి చేశాడు నిందితుడు. 🗡️ వెంటనే ప్రభాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలించారు. 📞 ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారిని మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ఆసుపత్రి నుండి అంబులెన్స్ లో సికింద్రాబాద్ యశోద కు తరలిస్తున్నారు. 🚑🏥



Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page