top of page
Shiva YT

వాట్సప్ వెబ్‌లో పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేయవచ్చు మీకు తెలుసా..

యూజర్లు వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన మెసేజ్ బబుల్‌లో ఎడిటెడ్ అనే ఒక లేబుల్ కనిపిస్తుంది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్(WhatsApp), కమ్యూనికేషన్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత సులభతరం చేస్తోంది. స్మార్ట్‌ఫోన్యూజర్లకే కాదు, వెబ్ యూజర్లకు కూడా ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ల అవసరాలను తీరుస్తోంది. రీసెంట్‌గా వాట్సప్ ఎడిట్ ఫీచర్ (Edit feature) అందుబాటులోకి తెచ్చింది. పంపించిన మెసేజ్‌లో ఏదైనా పొరపాటు ఉంటే, దాన్ని సరి చేసుకోవడం ఇప్పుడు సాధ్యమవుతోంది. యూజర్లు వాట్సప్ ద్వారా పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల్లోపు ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసిన మెసేజ్ బబుల్‌లో ఎడిటెడ్ అనే ఒక లేబుల్ కనిపిస్తుంది.

ఎడిట్‌ ఆప్షన్‌తో, అప్పటికే పంపించిన మెసేజ్‌లో తప్పులు సరి చేయడంతో పాటు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా ఎక్కువ పదాలు రాయాలంటే రాసుకోవచ్చు. ఎన్ని మార్పులు చేసినా ఎడిట్‌ హిస్టరీ అనేది అవతలి వ్యక్తికి కనిపించదు. ఇప్పటికే ఈ ఎడిట్ ఫీచర్ ఆండ్రాయిడ్ యాప్‌తో సహా ఐఓఎస్, వెబ్ యూజర్లకు రిలీజ్ అయింది. వాట్సప్ వెబ్‌లో ఈ స్పెసిఫికేషన్‌ను ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. Boat Smartwatch: బోట్ కొత్త స్మార్ట్‌వాచ్ సేల్ ఈరోజే... బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, మరెన్నో ఫీచర్స్

* వాట్సప్ వెబ్‌లో పంపిన మెసేజ్‌లను ఎలా ఎడిట్ చేయాలి?

స్టెప్ 1: PC లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సప్ వెబ్‌ ఓపెన్ చేయాలి. ఇందుకు web.whatsapp.com విజిట్ చేయాలి. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేసి త్రీ డాట్ మెనూలో ‘లింక్డ్ డివైజెస్’ సెలక్ట్ చేయాలి.

స్టెప్ 2: ఫోన్‌తో ఆ కోడ్ స్కాన్ చేసి వాట్సప్ అకౌంట్‌కు లాగిన్ కావాలి. ఈ వెబ్ వెర్షన్‌లో ఎడిట్ చేయదలచుకున్న రీసెంట్‌ మెసేజ్‌ను లొకేట్ చేయాలి.

స్టెప్ 3: ఆ మెసేజ్ బబుల్‌లో డౌన్ యారో (Down arrow) ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో 'ఎడిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4: ఇప్పుడు కావల్సినట్టు మెసేజ్ ఎడిట్ చేసుకొని సెండ్ చేయవచ్చు. అప్పుడు ఆ మెసేజ్ కింద ఎడిటెడ్ అనే లేబుల్ కనిపిస్తుంది.

Train Running Status: మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడుంది? ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు ఇలా

ఆండ్రాయిడ్ యాప్‌లో :

ఆండ్రాయిడ్ యాప్‌లో పంపించిన మెసేజ్‌ను ఎడిట్ చేయడం చాలా ఈజీ. ఇందుకు వాట్సప్ ఆండ్రాయిడ్ యూజర్లు పంపించిన తమ మెసేజ్‌పై హోల్డ్ చేసి పట్టుకోవాలి. అప్పుడు టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. తర్వాత ఎడిట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసి, మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. అయితే ఆండ్రాయిడ్ యూజర్లు ఈ ఆప్షన్‌ను వాడటం ఈజీయే కానీ వెబ్ యూజర్లు దీనిని వాడటానికి కొన్ని ఎక్కువ స్టెప్స్ ఫాలో కావాలి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం

bottom of page