top of page
Suresh D

రేషన్ కార్డు లేనివారికీ ఆరోగ్యశ్రీ..🤩

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు అందించే ఉచిత వైద్యం పరిమితిని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయలకు చేసింది. ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు రేషన్ కార్డు ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా రేవంత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ కాకపోవడం వల్ల చాలామంది ఈ పథకానికి దూరం అవుతున్నారని గుర్తించిన రేవంత్ సర్కార్ రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది.



bottom of page