top of page
Suresh D

అర్జున్ టెండుల్కర్ యార్కర్‌ దెబ్బకు.. కిందపడ్డ ముంబై బ్యాటర్‌ 🏏

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌ మరో 10 రోజుల్లో ప్రారంభం కాబోతోంది.  లీగ్‌లో పాల్గొనే ప్లేయర్లంతా తమ ఫ్రాంఛైజీలు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలకు చేరుతున్నారు.  ప్రాక్టీస్‌ సైతం ముమ్మరంగా సాగుతోంది.  ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ జట్టు సైతం ఓ వీడియోను పోస్టు చేసింది.  ప్రాక్టీస్‌ సందర్భంగా అర్జున్‌ నెట్స్‌లో బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. 🏏 యార్కర్లను సంధిస్తూ ఇబ్బంది పెట్టాడు.  అర్జున్‌ టెండూల్కర్ వేసిన బంతిని ఆపలేక వధేర కిందపడిపోయాడు.  ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో పంచుకుంది. 



bottom of page