top of page

🏥 హోమియోపతి మందులు వాడుతున్నారా? ఈ తప్పులు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు..

💊అల్లోపతి వైద్యం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. అయితే, అల్లోపతి వైద్యంలో వ్యాధి మూలాల నుంచి నిర్మూలన జరుగదు. మళ్లీ కొద్ది కాలానికి తిరిగి వస్తుంది. పదే పదే ఇలా రావడం వల్ల అసలు మెడిసిన్స్ పని చేస్తున్నాయా? లేదా? అనే అనుమానం కలుగుతుంది. దాంతో కొద్దరు హోమియోపతిని ఆశ్రయిస్తున్నారు.హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు తప్పకుండా కొన్ని నియామాలు పాటించాలి. వాటిని పాటిస్తేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. ఆ మెడిసిన్స్ ఎన్ని వాడినా ఉపయోగం ఉండదు.

🌱 హోమియోపతి మెడిసిన్స్ వాడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

  1. ఈ ఔషధం తీసుకున్న తరువాత కంటైనర్లు గట్టిగా మూసివేయాలి.

  2. హోమియోపతి వైద్యాన్ని అలాగే కంటిన్యూ చేయాలి.

  3. బలమైన సూర్యకాంతి ఉన్నచోట ఔషధాన్ని ఉంచవద్దు.

  4. ఎప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ ఉంచాలి. వేడి ప్రదేశంలో ఉంచితే దాని ప్రభావం తగ్గిపోతుంది.

  5. ఎలక్ట్రానిక్ పరికరాలకు దరంగా ఉంచాలి.

  6. మెడిసిన్ బాటిల్ మూతను ఎప్పుడూ తెరిచి ఉంచొద్దు.

  7. హోమియోపతి మందులు ఎప్పుడూ చేతిలోకి తీసుకుని వేసుకోవాలి. మూత ద్వారా మాత్రమే నోట్లో వేసుకోవాలి.

  8. ఔషధం తీసుకున్న 10 నిమిషాల వరకు ఏమీ తినొద్దు, తాగొద్దు.

  9. హోమియోపతి మందులు తీసుకుంటే కాఫీ, టీ తాగొద్దు.

  10. పుల్లటి ఆహారాలు తినొద్దు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page