top of page

👉తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నారా.🙁

🍏తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. మరి వీటికి చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించండి. మరి అవేంటో తెలుసుకుందామా🤔

🍊నిమ్మరసం: నిమ్మకాయు ఆహారాన్ని అరిగించే గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు మసాలా ఐటెమ్స్ కానీ, నాన్ వెజ్ ఐటెమ్స్ కానీ తింటే నిమ్మకాయను ఇస్తారు. అది పిండుకుని తింటే ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మీకు తిన్న ఆహారం ఎప్పుడైనా అరగలేదు అనిపించినా, కడుపు ఉబ్బరంగా ఉన్నా.. ఓ గ్లాసుడు నిమ్మరసం తాగండి.🍹

🌱అల్లం: అల్లం కూడా జీర్ణ వ్యస్థను సక్రమంగా పనిచేసే విధంగా చేస్తుంది. లాలాజలం, పైత్యరస ఉత్పత్తిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. తిన్న ఆహారాన్ని సులభంగా అరిగేందు, బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా తరిమి.. గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు వచ్చేంత వరకూ మరిగించాలి. గోరువెచ్చగా అయిన తర్వాత వాటిని తరచూ తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతుంది.🌶️

🌿పుదీనా, తులసి: పుదీనా, తులసిలోని జీర్ణక్రియను మెరుగుపరిచే ఔషధ గుణాలు ఉన్నాయి. పుదీనా, తులసి ఆకులను శుభ్రంగా కడిగి.. పావు లీటర్ నీటిలో వేసి.. అవి సగం వరకూ అడిగే వరకు మరిగించాలి. కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత వాటిని తరచూ తాగితే జీర్ణ సమస్యలు తగ్గుతుంది.🍃

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page