top of page
Suresh D

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చాయ్..💳👤

క్రెడిట్ కార్డు వినియోగం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. దాదాపు ప్రతి ఒక్కరూ వీటిని వినియోగిస్తున్నారు.  క్రెడిట్ కార్డులను బ్యాంకులు, నాన్ ఫైనాన్షియల్ సంస్థలు మంజూరు చేస్తాయి. అయితే ఇటీవల రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) క్రెడిట్ కార్డు నిబంధనలను సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా కార్డుదారులకు మేలు చేకూరేలా నిబంధనలను సవరించింది. గతంలో మనం క్రెడిట్ కార్డు జారీ చేసి బ్యాంకులను ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే ఉండేవి. ఏ కంపెనీ క్రెడిట్ కార్డు కావాలో ఎంపిక చేసుకునే వీలు లేదు. ఆ బ్యాంకులు తమతో ఒప్పందం చేసుకున్న కంపెనీల కార్డులు అందించేవి. తాజా నిబంధనల ప్రకారం ఏ కంపెనీ కార్డు కావాలో మనమే నిర్ణయించుకోవచ్చు.

7వ తేదీ నుంచి అమల్లోకి..

రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన ఆదేశాలు 2024 మార్చి 7 నుంచి అమలులోకి వచ్చాయి. క్రెడిట్ కార్డులు జారీ చేసి అన్ని బ్యాంకులు, నాన్ – బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ( ఎన్ఎఫ్ బీసీలు) ఆ నిబంధలను తప్పనిసరిగా పాటించాలి.

కొత్త నిబంధనలు ఇవే..

  • క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ ప్రారంభ లేదా ముగింపు తేదీలను ఎంచుకునే అవకాశం కార్డుదారుడికి కల్పించారు. హెల్ప్‌లైన్, ఈ మెయిల్ ఐడీ, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్ తదితర వాటి ద్వారా కార్డుదారుడు ఈ సేవలను పొందవచ్చు.

  • సాధారణంగా ఖాతాదారుడి అనుమతితోనే కార్డును జారీ చేస్తారు. ఒకవేళ కస్టమర్ అనుమతి లేకుండా కార్డు వస్తే దానిని యాక్టివేట్ చేయకూడదు. ఉదాహరణకు ఓటీపీ నంబర్ల వంటి వాటిని చెప్పకూడదు. కార్డును యాక్టివేట్ చేయడానికి ఖాతాదారుడి నుంచి అనుమతి రాకపోతే సదరు బ్యాంకు లేదా సంస్థ ఆ ఖాతాదారుడికి ఎటువంటి ఖర్చు లేకుండా ధ్రువీకరణ కోరిన తేదీ నుంచి ఏడు పని దినాల్లో కార్డు ఖాతాను మూసివేయాలి.

  • కార్డుదారుడు చెల్లించని పన్నులు, ఇతర చార్జీలపై వడ్డీలను కార్డు జారీచేసే వారు విధించకూడదు. 2022 అక్టోబరు ఒకటి నుంచి ఈ నిబంధన అమలులో ఉంది.

  • ఓవర్‌డ్రాఫ్ట్, నగదు క్రెడిట్, వర్కింగ్ క్యాపిటల్ లోన్ మొదలైన రుణ ఖాతాలకు ఒక రకమైన క్రెడిట్ కార్డులను జారీ చేయవచ్చు.

  • కార్డు దారుడు చెల్లింపు గడువులోపు మొత్తాన్ని క్లియర్ చేయకపోతే, వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి పూర్తయిపోతుంది. బకాయి మొత్తంపై లావాదేవీ తేదీ నుంచి వడ్డీ విధించే అవకాశం ఉంది.

  • క్రెడిట్ కార్డును జారీ చేసిన తేదీ నుంచి 30 రోజులలోపు కార్డు దారుడు దానిని యాక్టివేట్ చేయాలి. లేకపోతే కార్డుదారుడి నుంచి వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారంగా అనుమతి పొందాలి.

Related Posts

See All

ఐపీఎల్‌లో ముగిసిన ధోని శకం..🏏

ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు అంటే నిన్న సాయంత్రం మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

bottom of page