మలయాళ సినీ ఇండస్ట్రీని ప్రస్తుతం హేమ కమిటీ రిపోర్ట్ కుదిపేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామా చేశారు.
అయితే ఇండస్ట్రీలో జరుగుతున్న కాస్టింగ్ క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నటి రేవతి సంపత్ మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనను రేప్ చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇదిలావుంటే తాజాగా మరో నటి స్టార్ నటుడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’, ‘జనగణమన’ చిత్రాలతో తనకంటూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ నటుడిపై మలయాళ ట్రాన్స్‌వుమన్ నటి అంజలి అమీర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన మొదటి సినిమా పెరంబ్(Peranbu) చిత్రీకరణ సమయంలో నటుడు సూరజ్ వెంజరమూడు అనుచితమైన ప్రశ్న అడిగారని నటి అంజలి అమీర్ వెల్లడించారు. తాను షూటింగ్‌లో ఉండగా.. వెంజరమూడు వచ్చి సాధారణ మహిళలు సెక్స్‌లో సంతృప్తి చెందినట్లు ట్రాన్స్ జెండర్‌లు సంతృప్తి చెందుతారా అని అడిగాడు. ఈ ప్రశ్న నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయితే ఈ విషయాన్ని హీరో మమ్ముట్టికి చిత్ర దర్శకుడికి చెప్పినట్లు తెలిపింది. అనంతరం సూరజ్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపినట్లు చెప్పుకోచ్చింది.