top of page
MediaFx

గర్భిణులు పొగ తాగితే ఇన్ని అనర్థాలు ఉన్నాయా?


సిగరెట్‌ పొగలో దాదాపు నాలుగు వేల రకాల రసాయనాలు ఉంటాయి. అవి గర్భిణుల రక్తంలో కలిసిపోయి.. ప్లాసెంటా ద్వారా కడుపులోని పిండాన్ని చేరుతాయి. అలా.. శిశువు ఎదుగుదలకు, మానసిక అభివృద్ధికీ తీవ్రమైన ఆటంకాలను కలిగిస్తాయి. అంతేకాదు.. ఇందులోని కొన్ని రసాయనాలు తల్లి హృదయ స్పందనల రేటుపై ప్రభావం చూపుతాయి. దానివల్ల కాన్పు సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ముందునుంచే ఈ అలవాటు ఉండి, గర్భధారణ తర్వాత మానేసినా.. 27 శాతం మందికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుందట. అదే ప్రెగ్నెన్సీ సమయంలోనూ ధూమపానం చేస్తే.. ముప్పు అవకాశం 31 శాతం నుంచి 32 శాతం వరకు ఉంటుందని సర్వే చెబుతున్నది. పని ఒత్తిడిలోనో.. ఇంకేదో టెన్షన్‌లోనో రోజులో ఒక్క సిగరెట్‌ తాగినా.. పుట్టబోయే పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వేకారులు చెబుతున్నారు. అందుకే తల్లితోపాటు పుట్టబోయే బిడ్డకూడా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే.. స్మోకింగ్‌ తక్షణం మానేయాలని సర్వే సారాంశం.


bottom of page