📜 ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్‌తో పాటు మైగ్రేషన్ సర్టిఫికెట్ సహా మరికొన్ని సర్టిఫికెట్లను డిజిలాకర్‌లో అందుబాటులోకి ఉంచింది. 2014 నుంచి 2023 ఏడాది వరకూ చదువు పూర్తి చేసుకున్న విద్యార్ధులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. 🎓
📃 విద్యార్ధులు వారి అవసరాల కోసం డిజిలాకర్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో రవాణా శాఖకు సంబంధించి పలు కార్డుల స్థానంలో డిజిలాకర్‌లో డిజిటల్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. తాజాగా ఇంటర్ సర్టిఫికెట్లను కూడా డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 🖥️
📖 ఇంటర్ ఫెయిలైనా మళ్లీ రీఅడ్మిషన్ తీసుకునే చాన్స్ కల్పించిన సర్కార్ రాష్ట్రంలో బడికి వెళ్లే విద్యార్ధుల సంఖ్యను పెంచడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెంచడం ద్వారా ఎక్కువ మంది విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిచడంతో పాటు ప్రభుత్వం ద్వారా అందే పథకాలను విస్తృతంగా ఉపయోగించుకునేలా సౌకర్యాలు కల్పిస్తుంది. తాజాగా ఇంటర్స్ సర్టిఫికెట్లను కూడా డిజిలాకర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. 🏫
📚 ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చింది సర్కార్. ఇంటర్ ఫెయిలైన విద్యార్దులు తిరిగి కొత్తగా అడ్మిషన్ తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 🎓 వాస్తవంగా ఇంటర్మీడియట్ రెండేళ్లు పూర్తి చేసుకున్నవారు ఏవైనా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయితే ఆయా సబ్జెక్ట్ లను తిరిగి సప్లిమెంటరీ విధానంలో రాసుకుని పాస్ కావల్సి ఉంటుంది. 📖 అలాంటి వారి సర్టిఫికెట్లపై సప్లిమెంటరీ లేదా జూన్-జూలై లో పాస్ అయినట్లు సర్టిఫికెట్లు ఇస్తారు. 📚📖