top of page

🏢👮‍♂️ హైదరాబాద్‌ కొత్త సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నియామకం...

హైదరాబాద్‌, డిసెంబర్ 12: తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్‌ కొత్త ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్‌ 12) హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిషనర్‌లను నియమించింది. 🕵️‍♂️👮‍♂️

యాంటీ నార్కోటిక్ బ్యూరో హెడ్‌తో పాటు మూడు కమిషనరేట్‌లకు కొత్త కమిసనర్ లను నియమించింది. 🏙️🚔 హైదరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి నియమితులయ్యారు. 🕵️‍♂️ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా జి సుధీర్‌బాబు నియమితులయ్యారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా అవినాష్ మొహంతి, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య నియమితులయ్యారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐపీఎస్ బదిలీలకు తొలిసారి శ్రీకారం చుట్టుంది. 🔄 కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐదుగురు ఐపీఎస్ అధికారులను మంగళవారం బదిలీ చేశారు. 🏙️ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 🔄 దీంతో ప్రస్తుతం రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌లుగా ఉన్న దేవేంద్రసింగ్‌ చౌహాన్‌, ఎం స్టీఫెన్‌ రవీంద్రలు బదిలీ కావడంతో.. వారు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌కు రిపోర్టు చేయాల్సిందిగా సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. 📋 ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 👥🏛️

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page