top of page
MediaFx

ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పై స్పందించిన ఎన్టీఆర్..

🎉 ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమి భారీ విజయం సాధించింది. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, డైరెక్టర్లు, నిర్మాతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిన్న చాలా మంది ట్వీట్స్ చేశారు.

🔥 నేడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, తన మావయ్య చంద్రబాబుకు చారిత్రాత్మక విజయం సాధించిందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఆశిస్తున్నానని, లోకేష్, బాలకృష్ణ, భరత్, పురంధేశ్వరి అత్త, పవన్ కళ్యాణ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని, కనీసం మాట్లాడలేదని కొందరు విమర్శించారు. పవన్ కళ్యాణ్ విజయం కూడా సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఎన్టీఆర్ ట్వీట్ హమ్మయ్య ఇప్పటికైనా చేసావు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, ఎందుకు ఆలస్యం చేశావని కొందరు అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి వైరల్ అయ్యారు.


bottom of page