top of page

🌐 ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒక్క ఫోన్‌ కాల్‌ చాలంటున్న సీఎం జగన్‌..

🌐 రాష్ట్రంలో ఏర్పాటైన ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్‌. మరో 6 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు.

నెల్లూరు జిల్లాలో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ ప్లాంట్‌, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్‌ యూనిట్‌, కాకినాడలో ప్రింటింగ్‌ క్లస్టర్‌, కర్నూలులో సిగాచి ఫార్మాస్యూటికల్స్‌, ధాన్యం ఆధారిత బయోఇథనాల్‌ యూనిట్లను ప్రారంభించారు. 1072కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన ఈ పరిశ్రమలతో 21వేల 79మందికి ఉపాధి లభించబోతోందని చెప్పారు. 🛠 పారిశుద్ధ్య కార్మికుల కోసం కొత్తగా వంద క్లీనింగ్‌ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ వాక్యూమ్‌ సక్షన్‌ మెషినరీని తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర జెండా ఊపి ప్రారంభించారు సీఎం జగన్‌. ఎంపికచేసిన లబ్ధిదారులకు ఈ మురుగుశుద్ధి వాహనాలను అందజేశారు. 🚚

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page