రామాయణ అరణ్య కాండను.. విజువల్ వండర్‌గా చూపించనున్న సినిమానే ఆదిపురుష్. అలాంటి ఈ సినిమా.. మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుని జూన్ 16న రిలీజ్ కు రెడీ అయింది. ఇక ఆ రిలీజ్ డేటే.. దగ్గర పడుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం నుంచి..
రామాయణ అరణ్య కాండను.. విజువల్ వండర్‌గా చూపించనున్న సినిమానే ఆదిపురుష్. అలాంటి ఈ సినిమా.. మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకుని జూన్ 16న రిలీజ్ కు రెడీ అయింది. ఇక ఆ రిలీజ్ డేటే.. దగ్గర పడుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం నుంచి.. ఈ సినిమాకు అనుకూలంగా ఓ జీవో రాబోతోంది. దాంతో టికెట్ ప్రైస్ పై ఓ క్లారిటీ కూడా రాబోతోంది. టాలీవుడ్‌లో.. టికెట్ ప్రైస్ ఎప్పటి నుంచో పెద్ద ఇష్యూగా ఉంది. టికెట్ రేట్ తక్కువగా ఉండాలని.. కాదు కాదు కాస్త ఎక్కువగా ఉన్నా పర్లేదని.. అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇక ఈ చర్చలోకి ఎంటర్ అయిన ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ పై ఓ జీవో జారీ చేసింది. స్లాబుల వారిగా థియేటర్లను.. వాటి టికెట్ రేట్‌ను.. సెట్ చేసింది. రేట్లను కట్టడి చేసింది. అయితే పెద్ద మనుషుల రెక్వెస్ట్ కారణంగా.. పెద్ద సినిమాల విషయంలో మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ లో కూడా ప్రభుత్వం ఇదే చేయనుంది. ఈ మూవీ టికెట్ ప్రైసింగ్ పై ఓ జీవో రిలీజ్ చేయబోతోంది. అకార్డింగ్ టూ TFI ఇంటర్నల్ టాక్… ఏపీలో ఇప్పటికే ఉన్న టికెట్ రేట్లకు..అదనంగా మరో 50 రూపాయలు వసూలు చేసుకునేందుకు .. ఆదిపురుష్ టీంకు ఓకే చెప్పిందట జగన్ ప్రభుత్వం. ఓకే చెప్పడమే కాదు.. దీనికి సంబంధించిన జీవోను కూడా రెడీ చేసి రిలీజ్ చేయనుందట. ఇక ఈ జీవో రిలీజ్ అయిన తర్వాతే… ఏపీలో ఆదిపురుష్ బుకింగ్స్ తెరుచుకోనున్నట్టు.. స్ట్రాంగ్ టాక్ వినిపిస్తోంది. ఇక దీనికితోడు.. ఆదిపురుష్ లాంటి మైథలాజికల్ విజువల్ వండర్ సినిమాకు.. టికెట్ రేట్‌పై ఎక్ట్రా 50 పే చేయడం పెద్ద విషయమే కాదంటూ సోషల్ మీడియాలో.. అనుకూల పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రభాస్ రఘురాముడిగా.. చేసిన ఈ సినిమా…ఏపీలో రికార్డు కలెక్షన్లు కొట్టడం ఖాయం అనే కామెట్లు ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తున్నాయి.