top of page

🔮2 రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. పవన్ కళ్యాణ్

📅 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాల సమావేశం కోసం ఢిల్లీ వెళ్ళిన ఆయన సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయని.. పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత తనకు కూడా అదే అనిపించిందని అన్నారు. దేశానికి బలమైన నాయకత్వం అవసరమని.. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైంని పేర్కొన్నారు.

✨ ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి ఏ విధంగా దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి..? దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్న దానిపై చర్చ జరిగిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదని తెలిపారు. మొత్తం దేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ప్రధానంగా చర్చ జరిగిందని వెల్లడించారు. అయితే ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే 38 పార్టీలు ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా? అని పవన్‌ను ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని అన్నారు. ✨

Comentarios


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page