top of page
Shiva YT

📢 కోటాలో మరో విద్యార్ధి ఆత్మహత్య! 😢 ఈ ఏడాది 26కు చేరిన స్టూడెంట్‌ సూసైడ్స్‌

📅 ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బుధవారం (సెప్టెంబర్‌ 27) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 😞 అద్దె గదిలో ఉంటూ విద్యార్ధి నీట్‌ పరీక్షకు స్వయంగా ప్రిపేర్‌ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. 📚

కాగా ప్రతీ యేట లక్షల కొద్ది విద్యార్ధులు ఇంజనీరింగ్‌, మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవ్వడానికి కోటాకు వస్తుంటారు. 📝 గడచిన ఏళ్లలో నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులు అధిక సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 😔 ముఖ్యంగా రాజస్థాన్‌లోని కోటా కోచింగ్‌ హబ్‌లో ఈ ఆహ్మహత్యను అధికంగా నమోదవుతున్నాయి. 🏫 గతేడాది కోటాలో 15 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 😥 ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది. 😢 తాజాగా యూపీ విద్యార్థి మరణంతో ఆ సంఖ్య 26కు చేరడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 😞 రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. 🏛️ కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు నానాటికి కలవరపెడుతున్నాయి. 😓

🔍 అధిక ఒత్తిడి, పరీక్షల్లో ఫెయిల్‌ అవుతానేమోననే భయం విద్యార్ధులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. 📝 కోటాలోని ప్రైవేటు హాస్టళ్లు, పీజీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్ధుల్లో ఎలాంటి డిప్రెషన్ లేదా ఒత్తిడికి లోనవకుండా చూసేందుకు కోచింగ్ హబ్‌లు ప్రత్యేక చర్యలకు పూనుకుంటున్నాయి. 🏘️ హాస్టల్ వార్డెన్‌లు, మెస్ వర్కర్లు, టిఫిన్ సర్వీస్ ప్రొవైడర్లను ఆశ్రయిస్తున్నారు. 🍽️ తాజా ఆత్మహత్యల నేపథ్యంలో కోటాలో ప్రిపేర్‌ అవుతోన్న నీట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు రొటీన్‌ పరీక్షలను రెండు నెలల పాటు నిలిపివేయాలని నగరంలోని జిల్లా యంత్రాంగం ఇటీవల కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను ఆదేశించింది. 📢📚🏫😥🏘️🍽️

bottom of page