top of page
MediaFx

మరో మైల్​స్టోన్​‌ను అందుకున్న ’12th ఫెయిల్’..

కసి, పట్టుదల ఉంటే.. ఎలాంటి కష్ట సాధ్యమైన పని అయినా చేధించవచ్చు. జీవితంలో అనుకున్నవి సాధించవచ్చు. అలాంటి స్ఫూర్తిని రగిలించే సినిమా ’12th ఫెయిల్’.

ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవితం ఆధారంగా.. అనురాగ్‌ పాఠక్‌ రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది ఈ మూవీ. ఇప్పుడు ఎన్నో రికార్డులు అందుకుని ముందుకు సాగుతోంది. తాజాగా మరో మైల్​స్టోన్​ను అందుకుంది. 23 సంవత్సరాలు తర్వాత దాదాపు 25 వారాలుగా థియేటర్లలో రన్ అయిన సినిమాగా చరిత్ర పుటల్లో పేరు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు విధు వినోద్ చోప్రా సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఈ హిట్‌ సినిమా థియేటర్లలో విడుదలై 25 వారాలు కంప్లీట్ అయింది. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. 23 ఏళ్ల తర్వాత ఈ రికార్డు నెలకొల్పిన ఫస్ట్ సినిమాగా ’12th ఫెయిల్‌’ నిలిచింది. మా కలను నిజం చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు​. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది” అని పేర్కొన్నారు. త్వరలో ఈ మూవీ చైనాలోనూ విడుదలయ్యేందుకు రెడీ అవుతుంది. మంచి కథకు సరిహద్దులు దాటి ఆదరణ లభిస్తుందని తాను నమ్ముతానని.. డైరెక్టర్ విధు వినోద్ చోప్రా తెలిపారు. ఈ కథ అక్కడ కూడా మరికొందరిలోనూ స్ఫూర్తి నింపనుందని చెప్పారు. విడుదలైన ప్రతీ ప్రాంతంలోనూ దీనికి మంచి ప్రేక్షకాదరణ లభించడం ఆనందంగా ఉందన్నారు. చైనీస్‌ ప్రేక్షకులు దీనితో ఎలా కనెక్ట్‌ అవుతారోనని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వినోద్ చోప్రా వెల్లడించారు.


bottom of page