తెలంగాణ కాంగ్రెస్‌లో మరో చిచ్చు రేగింది. కొత్త కమిటీలపై రచ్చ మొదలైంది. చోటు దక్కని నేతలంతా నిరసన గళం వినిపిస్తున్నారు. 😖 రీసెంట్‌గా ఏఐసీసీ ప్రకటించిన కమిటీలపై ఓ సీనియర్ లీడర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నాకేం తక్కువ! నన్నెందుకు తీసుకోలేదంటూ మండిపడుతున్నారు. 😔
ఇంతకీ, ఆ లీడర్ ఎవరు?. 🤔
త్వరలోనే జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం స్పెషల్ టీమ్‌ను ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. 🏛️ ప్రత్యేక ఎన్నిక కమిటీ పేరుతో 26మంది సీనియర్లకు చోటు కల్పించింది. 🔢 దీనికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించింది. 🗂️ఇందులో, రేవంత్‌తోపాటు భట్టి, జీవన్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్‌కుమార్ యాదవ్, జానారెడ్డి, వీహెచ్, పొన్నాల, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, శ్రీధర్‌బాబు, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, రేణుకాచౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, పోడెం వీరయ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సునీతారావు సభ్యులుగా ఉన్నారు. 🧑🤝🧑 రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు, సేవాదళ్ చీఫ్‌ను ఎక్స్‌ఆఫీషియో సభ్యులుగా అవకాశం కల్పించారు. 🙌 అయితే, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తనను ఎందుకు విస్మరించారంటూ నిరసన గళం విప్పారు పొన్నం. 🥀 ఇంతకుముందు ప్రకటించిన ప్రచార కమిటీలో కూడా తన పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు టాక్. 💬 కాంగ్రెస్‌నే నమ్ముకొని, పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమిస్తోన్న తనను పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 🤷♂️