💵 2000 నోటు మార్చుకోవడానికి చివరి తేదీ: 30 సెప్టెంబర్ 💰 రూ. 2000 నోటును చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి.. ఈ నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి చాలా మంది బ్యాంకులను సంప్రదిస్తున్నారు.
💳 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి నాలుగు నెలల సమయం ఇచ్చింది. ఇది వచ్చే నెల సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. 🗓️ కాబట్టి, రూ. 2000 నోట్లను 30 సెప్టెంబర్ 2023లోగా మార్చాలి లేదా డిపాజిట్ చేయాలి. కాబట్టి, మీరు ఇంకా రాబోయే నెలల్లో డిపాజిట్లు చేయాలనుకుంటే.. బ్యాంకు సెలవుల తేదీలను జాగ్రత్తగా చూసుకోవాలి.
💰💲 సెప్టెంబర్ 2023లో బ్యాంక్ సెలవులు.. 🏦 🗓️ ఆర్బీఐ ప్రకారం, సెప్టెంబర్ 2023లో 15 రోజుల కంటే ఎక్కువ బ్యాంకు సెలవులు ఉండబోతున్నాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. కృష్ణ జన్మాష్టమి, వినాయక చతుర్థి, గణేష్ చతుర్థి, నుఖాయ్, శ్రీ నారాయణ గురు సమాధి దినం, మహారాజా హరిసింగ్ జయంతి, శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మోత్సవ్, మిలాద్-ఎ-షరీఫ్ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా సెప్టెంబర్‌లో బ్యాంకులకు సెలవులు రానున్నాయి. 🎉🏧